వినాయక చవితి వేడుకులకు దూరంగా ఉన్న అల్లు శిరిష్...ఇల్లు వదిలి వెళ్ళిపోయాడా ..?
on Sep 3, 2022

అల్లు శిరీష్ గత కొద్ది రోజులుగా కుటుంబానికి దూరంగా ఉంటున్నాడని, ఇంట్లో వాళ్ళపై అలిగి వెళ్ళిపోయడనే వార్తలు వినిపిస్తున్నాయి..
అల్లు అరవింద్ ఇండస్ట్రీ లో ఎన్నో హిట్ సినిమాలు నిర్మించాడు .ఆయన పెద్ద కొడుకు నిర్మాత గా చేసాడు, రెండో కొడుకు అల్లు అర్జున్ తన నటనతో గొప్ప హీరోగా మారాడు, ఆహా పేరుతో ఓటిటి క్రియేట్ చేసి అందులో ట్రెండ్ కి తగ్గట్టుగా సినిమాలు విడుదల చేస్తూ విజయవంతంగా నడుపుతున్నాడు.ఐతే చిన్న కొడుకు శిరిష్ ని మాత్రం హీరోగా నిలబట్టలేకపోయాడు.
శిరిష్ ఇండస్ట్రీ కి వచ్చి చాలా కాలం అవుతున్నా ఒక్క హిట్ కూడా లేదు, గౌరవం(2013) మూవీతో తెలుగులోకి అరంగేట్రం చేయగా అది ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది, ఆ తర్వాత మారుతి డైరెక్షన్ లో వచ్చిన " కొత్త జంట " మూవీ పర్వాలేదు అనిపించినా హిట్ టాక్ తెచ్చుకోలేకపోయింది.తర్వాత పరశురాం డైరెక్షన్ లో శ్రీరస్తు శుభమస్తు మూవీ మార్నింగ్ షో తో పాజిటివ్ టాక్ వచ్చినా ఆశించినంతగా హిట్ కొట్టలేకపోయింది,ఆ తర్వాత వచ్చిన " ఒక్క క్షణం" , "ABCD " ఏవీ కూడా హిట్ అవ్వలేదు.
ఇలా అల్లు శిరీష్ ఒత్తిడికి గురవుతున్నట్టు తెలుస్తుంది.తనతో పాటు ఇండస్ట్రీ కి వచ్చిన వరుణ్ తేజ్, ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ లు కూడా హిట్ లు కొడుతూ సినిమాలు చేస్తు తమకంటూ ఇమేజ్ సంపాదించుకుంటున్నారు.ఇదే సమయంలో అల్లు అరవింద్ తన కెరీర్ గురించి పట్టించుకోవట్లేదని అసహనంతో ఉన్నట్లు తెలుస్తుంది, దీంతో కుటుంబ సభ్యులతో గొడవపెట్టుకోని ఇంట్లో నుండి వెళ్ళిపోయడని వినిపిస్తోంది, ఎక్కడో ముంబైలో ఒంటరిగా ఉన్నాడని ప్రచారం జరుగుతూంది.
తాజాగా జరిగిన వినాయక చవితి వేడుకుల్లో అల్లు అర్జున్, అల్లు అరవింద్ , పిల్లలు అందరూ కనిపించారు కానీ శిరీష్ కనిపించకపోవడంతో ఇది నిజమనే అనిపిస్తోంది.ప్రస్తుతం శిరిష్ చేస్తున్న సినిమా " ప్రేమ కాదంట " , ఇందులో అను ఇమాన్యుయల్ హీరోయిన్ గా నటిస్తోంది , ఐతే కొన్ని రోజుల ముందు వరకు వీళ్ళిద్దరి మధ్య ఎఫైర్ ఉందని వినిపిస్తోంది.ఇందులో ఎంత వరకు నిజమో ఉందో తెలియాల్సి ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



